తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…నేడు ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో నేటితో శ్రీవారి జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. ముగియనున్నాయి. ఇక ఇవాళ స్వర్ణకవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల శ్రీవారు.
ఈ తరుణంలోనే ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. జేష్ఠాభిషేకం ముగింపు కార్యక్రమం కారణంగా పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,366 మంది భక్తులు కాగా.. తలనీలాలు సమర్పించిన 48,183 మంది భక్తులుగా ఉన్నారు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా నమోదు అయింది.