వినియోగదారులకు అలర్ట్.. రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’..

-

ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ తో సహా ఇంటర్నెట్ సర్వ సాధారణమైపోయింది. మొబైల్ తో పాటు ఖచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వినియోగదారులు. ఇంటర్నెట్ లేకపోతే అసలు మొబైల్ ఫోన్ ఎవరు కూడా వాడటం లేదు. అలాంటిది ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఇంటర్నెట్ లేకుండా ఉండగలమా.? చాలా కష్టం. అయితే రేపటి నుంచి పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది రోజుల పాటు ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉండవు.

దీనికి కారణం ఆ రాష్ట్రంలో జరగనున్న మాధ్యమిక పరీక్షలు. అయితే ఈ ఇంటర్నెట్ అంతరాయం రాష్ట్రమంతటా కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా, ఉత్తర దినాజ్పూర్, కూచ్ బేహార్, జల్ పై గురి, డార్జిలింగ్, బీర్భూమ్, లాంటి జిల్లాల్లో మాత్రమే ఆంక్షలు అమలులోకి రానున్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో మార్చి 7 నుంచి 9 వ తేదీ, మార్చి 11 నుంచి 12వ తేదీ, మార్చి 14 నుంచి 16 వ తేదీల్లో… ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మొబైల్ ఇంటర్నెట్ మరియు బ్రాడ్ బాండ్ సేవలు తాత్కాలికంగా నిలిపి వేయబడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news