రాజ్యాంగం వల్లనే పేదలకు హక్కులు దక్కాయి : రాహుల్ గాంధీ

-

రాజ్యాంగం వల్లన పేదలకు హక్కులు దక్కాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సరూర్ నగర్  స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ.

దేశంలో పేదల జాబితా తయారు చేసి ప్రతీ పేద ఇంట్లో ఓ మహిాళా బ్యాంకు ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఎవ్వరూ కలలో కూడా ఊహించనటువంటి విప్లవాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణ లో ఆగస్టు 15వరకు రైతుల రుణమాఫీ చేయబోతున్నామని.. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ టీమ్ పని చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news