బెంగళూరు మాజీ కార్పొరేటర్‌ ఇంట్లో ఐటీ సోదాలు​.. మంచం కింద డబ్బు చూసి షాక్​!

-

బెంగళూరులోని ఓ ఇంట్లో కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ముఖ్యంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం బెంగళూరులోని బంగారు నగల వ్యాపారులు, ఇతర వనరుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ శాఖ… నగరంలో దాడులు నిర్వహిస్తోంది.

ఆర్టీ నగర్ సమీపంలోని ఆత్మానంద కాలనీలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి నిర్వహించిన సోదాల్లో 42 కోట్ల నగదు బయటపడింది. 500 రూపాయల నోట్లను 23 బాక్సుల్లో మంచం కింద భద్రపరిచారు. సమాచారం అందుకున్న ఐటీ అధికారులు.. ఆర్టీ నగర్ లోని రెండు చోట్ల దాడులు నిర్వహించగా… ఒక చోట నగదు దొరికింది. ఇళ్లు ఖాళీగా ఉందని.. అక్కడ ఎవరూ ఉండటంలేదని తెలుస్తోంది.

అయితే ఆ ఇంటి యజమాని వివరాలపై ఐటీ అధికారులు ఎలాంటి వివరాలు వెళ్లడించలేదు. ఈ వ్యవహారంలో ఐటీ అధికారులు మాజీ కార్పొరేటర్, ఆమె భర్తను వారి నివాసంలో విచారిస్తున్నారు. కార్పొరేటర్ భర్త ఓ గుత్తేదారని.. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై 40 శాతం కమీషన్ తీసుకుందని ఆరోపించిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లో ఆయన కూడా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news