అమెరికాతో దోస్తీ చంద్రయాన్​లా దూసుకెళ్తోంది : జైశంకర్

-

భారత్‌-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేనంత అత్యంత ఉన్నత స్థాయిలో భారత్-యూఎస్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య మైత్రి.. ఒకరినొకరు అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా చూసే దశకు చేరుకుందని జైశంకర్ తెలిపారు.

ప్రస్తుతం జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా హౌస్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అగ్రరాజ్యంతో బంధంపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య బంధాన్ని జైశంకర్ చంద్రయాన్‌తో పోల్చారు. చంద్రయాన్‌లానే రెండు దేశాల దోస్తీ దూసుకెళ్తోందని.. మరికొన్ని రోజుల్లో ఈ మైత్రి.. చంద్రుడిని చేరుకుంటుందని.. దాన్ని దాటి కూడా వెళుతుందని చెప్పారు.

భారత్-యూఎస్ మధ్య సంబంధాలు అత్యంత ఉన్నతస్థాయిలో ఉన్నాయని.. సహజ మిత్రులుగా మారిపోయామని జైశంకర్ ఉద్ఘాటించారు. జీ20 సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించిందని.. దీని వెనుక భారత్‌-అమెరికా భాగస్వామ్యం కూడా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఇంతలా అమెరికాతో సంబంధాలు వృద్ధి చెందడం వెనుక ప్రవాస భారతీయులు కారణమని చెప్పారు. రెండు దేశాల మధ్య మానవబంధాలు లోతుగా పెనవేసుకుపోయినపుడు మైత్రి మరో స్థాయికి చేరుకుంటుందని.. ఇప్పుడు అమెరికా-భారత్‌ మధ్య అదే జరుగుతోందని జైశంకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news