గత కొన్నిరోజులుగా ఎర్ర సముద్రంలో సోమాలియా దొంగలూ రెచ్చిపోతున్నారు. నౌకల్ని అపహరించడం.. దాని యజమానుల నుంచి డబ్బు గుంజుకోవడం వారికి రివాజుగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఆపరేషన్లో పాల్గొన్న భారత రక్షణ సిబ్బందికి బల్గేరియా కృతజ్ఞతలు తెలిపింది. నౌక సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా జాతీయులు ఉన్నారని, వారిని రక్షించినందుకు, దానికి భారత్ అందించిన సహకారానికి బల్గేరియా ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి మారియా గాబ్రియెల్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత సిబ్బంది రక్షణ కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.
దీనిపై మన విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించిన తీరు ఆకట్టుకుంటోంది. బల్గేరియా నేతల ట్వీట్పై స్పందించిన జైశంకర్.. ‘స్నేహితులు ఉన్నది అందుకే కదా’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన రిప్లైకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జైశంకర్ మాట్లాడిన ప్రతిసారి ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
That’s what friends are for.@rajnathsingh @indiannavy https://t.co/WGlYVzQEZA
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) March 17, 2024