దేశంలో సుస్థితపాలన అందించేది మోదీనే : కిషన్ రెడ్డి

-

మోదీ నాయకత్వంలో దేశంలో మంచిపరిపాలన జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో శాంతియుతమైన పద్ధతిలో పాలన జరుగుతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని వివరించారు. బీఆర్ఎస్ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోపిడి చేసిందని ఆరోపించారు.

‘ఆప్‌ ప్రభుత్వంతో చేతులుకలిపి కవిత మద్యం కుంభకోణానికి పాల్పడింది. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ తలదించుకునేలా చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా దోపిడి మెుదలు పెట్టింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దేశంలో సుస్థితపాలన అందించేది మోదీనే. మోదీని హాట్రిక్‌ ప్రధానిగా ఆశీర్వదించాలి. దక్షిణ భారతదేశంలో మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ప్రజలతో మమేకమౌతున్నారు. మోదీ.. తెలుగును ప్రోత్సహిస్తూ స్వయంగా తెలుగు మాట్లాడుతున్నారు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version