కెనరా బ్యాంక్‌లో 538 కోట్ల ఆర్థిక మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. దిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘ విచారణ తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గోయల్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇవాళ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచి ఈడీ అధికారులు కస్టడీ రిమాండ్‌ను కోరనున్నారు.
538 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డారని గోయల్‌తో పాటు అతని భార్య అనిత, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేయగా.. తొలుత సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 848 కోట్ల రుణ పరిమితులు, రుణాలను మంజూరు చేస్తే.. రూ.538 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదని బ్యాంక్ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనుబంధ కంపెనీలకు జేఐఎల్ దాదాపు 14వందల కోట్లు చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధులు స్వాహాచేశారని గుర్తించారు. గోయల్ వ్యక్తిగత ఖర్చులను జేఐఎల్ నుంచే చెల్లించారని సమాచారం. కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది.