చెట్టును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

చెట్టుకు కారు ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇద్దుర చిన్నారులు సహా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని గిరిడీహ్​లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వీరంతా పెళ్లి బరాత్​ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిడీహ్​లో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగ్మారా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువుల పెళ్లి బరాత్​కు వెళ్లిన వీరంతా స్కార్పియో వాహనంలో తిరిగి తోరియాకు బయల్దేదారు. ఈ క్రమంలో బగ్మారా ప్రాంతానికి రాగానే డ్రైవర్​ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో . ఆ తర్వాత ఒక్కసారిగా వాహనం.. చెట్టును ఢీకొట్టింది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల లేదా.. అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.