సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్​ నోటిఫికేషన్​.. 400కుపైగా ఖాళీలు..పోస్టుల వివరాలు ఇవే

-

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బీఈఎల్ రిక్రూట్‌మెంట్- 2023 పేరుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 428 ప్రాజెక్ట్, ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 18వ తేదీతోతో దరఖాస్తుల గడువు ముగియనుంది. నవరత్న విభాగానికి చెందిన ఈ భారత దేశపు ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బెంగళూరులోని కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న 428 పోస్టులను భర్తీ చేస్తోంది.

పోస్టుల వివరాలు..

  • మొత్తం- 428 పోస్టులు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు-327
  • ట్రైనీ ఇంజినీర్ పోస్టులు- 101

ప్రాజెక్ట్ ఇంజినీర్ 327 పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్-164, మెకానికల్-106, కంప్యూటర్ సైన్స్ -47, ఎలక్ట్రికల్-07, కెమికల్-1, ఎరో‌స్పేస్ ఇంజినీరింగ్-2 ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్ పోస్టులలో ఎలక్ట్రానిక్స్-10, ఎరోస్పేస్ ఇంజినీరింగ్ పోస్టులు 1 ఉన్నాయి.

అర్హతలు..
ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు సంబంధిత విభాగంలో ఏదైనా యూనివర్సిటీ, కళాశాల నుంచి బీఈ, బీటెక్, బీఎస్సీ(4 సంత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version