రేపు ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించినున్నారు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. గతవారమే కేజ్రీవాల్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి.
ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే, లిఖిత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. సీబీఐ తరపున వాదనలు వినిపించారు ఎస్వీ రాజు, అడిషనల్ సొలిసిటర్ జనరల్. లిక్కర్ సిబిఐ కేసులో కేజ్రివాల్ కు బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించింది సిబిఐ. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు సుప్రీంకోర్టు ఎవరికీ అనుకూలంగా తీర్పు వెల్లడిస్తుందో వేచి చూడాలి.