విచారణ జరపకుండా కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదు : సీబిఐ

-

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చార్జ్ షీట్ చూడకుండా, ట్రయల్ కోర్టు బెయిల్ పై విచారణ జరపకుండా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదు అని సీబీఐ పేర్కొంది. రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పు వెలువడనుంది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాదించారు. వలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అరెస్టులను నియంత్రించడం కోసమే సీఆర్పీసీలో సెక్షన్ 41(ఏ)ను 2010లో చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు పిలిపించవచ్చని వెల్లడించారు సింఘ్వీ.

మరోవైపు సీబీఐ మాత్రం.. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగింది. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించలేదు..కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నాం. ట్రయల్ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ద్వారా అరెస్ట్ కి గల కారణాలు తెలిపాం. కేజ్రివాల్ కి వ్యతిరేకంగా చార్జ్ షీట్ దాఖలైంది. కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ కేసుకు పంజాబ్ లింక్ కూడా ఉంది.  ఇంకా విచారణ జరపాల్సి ఉంది. పంజాబ్, ఢిల్లీలలో ఆప్ సర్కార్ ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version