ఎంపీ బరిలో కంగనా రనౌత్, అక్షయ్ కుమార్.. బీజేపీ బంపర్ ఆఫర్..!

-

ఎన్నికలపై బీజేపీ స్పీడు పెంచింది. ఈసారి ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించడమే టార్గెట్ గా ప్రధాని మోడీ టీమ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏ క్షణమైనా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించబోతున్న కమలం పార్టీ.. ఈ జాబితాలో ఎవ్వరూ ఊహించని కొత్త ముఖాలకు ఛాన్స్ కల్పించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈసారి బాలీవుడ్ ప్రముఖ యాక్టర్స్ కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ లను బరిలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆనౌన్స్ చేయబోయే తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు ఉండనున్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో టాక్ వినిపిస్తోంది.

అలాగే వీరిద్దరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, అక్షణ్ కుమార్ లు వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుండటంతో వీరి రాజకీయ రంగ ప్రవేశంపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సినీతారలను బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం వేళ ఇటీవల కంగనా రనౌత్ స్పందిస్తూ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయం అనే టాక్ నేషనల్ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి కంగనా, ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అక్షయ్ కుమార్ లను నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news