కంగనాకు అందుకే వై కేటగిరీ ఇచ్చాం, కేంద్రం స్పష్టం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తండ్రి హిమాచల్ ప్రదేశ్‌ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన తరువాత కంగనా రనౌత్‌కు వై-ప్లస్ సెక్యూరిటీ భద్రత అందించినట్లు కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆమె తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌కు లేఖ రాయడంతో హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం రనౌత్‌ కు భద్రత కోరిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలో కొంతమందికి “గుండెల్లో మంట” కలిగించిన సామాజిక సమస్యలపై రనౌత్ స్పందిస్తున్నారని అన్నారు.

రనౌత్ తండ్రి కూడా జై రామ్ ఠాకూర్‌ను కలిశారని, తన కుమార్తె వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారని… ఆయన అభ్యర్థన ఆధారంగా సిఎం పరిస్థితి గురించి కేంద్రానికి తెలియజేశారని కేంద్ర మంత్రి వివరించారు. అయితే ఆమె భద్రత కోసం ఎవరు ఖర్చు చేస్తారనేది మాత్రం ఆయన చెప్పలేదు. శివసేన పార్టీ వర్సెస్ కంగనా రనౌత్ గా ముంబైలో పరిస్థితి ఉంది.