కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు టైరు పేలి.. ఆరుగురు మృతి

కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని కొప్పల జిల్లా జాతీయ రహదారి 50పై ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

విజయపురకు చెందిన కుటుంబ సభ్యులు బెంగుళూరుకు వెళుతున్న క్రమంలోనే టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.