కర్ణాటక సీఎం యడియూరప్ప ఔట్? కొత్త సీఎం ఎంపికలో బీజేపీ

-

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( Yediyurappa )ను మార్చాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తే ఆయన వారసుడి ఎన్నిక అంత ఆషామాషీగా కనిపించడం లేదు.

Yediyurappa |  యడియూరప్ప
Yediyurappa | యడియూరప్ప

ఈ నెల 26వ తేదీ నాటికి బీఎస్ యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రెండేండ్లు పూర్తి కానున్నది. బీజేపీ అధిష్ఠానం ఆయన్ని రాజీనామా చేయమని కోరినట్లు స్పష్టమవుతుంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికి 12మందికి పైగా నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం.

రాష్ట్రంలో బలమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బీఎస్ యడియూరప్ప. ఆయన తర్వాతా ఆ కమ్యూనిటీ ప్రాతినిధ్యం కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ఇందుకోసం లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను సీఎం అభ్యర్థిత్వం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ధర్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నల్, గనులు, భూగర్భశాఖ మంత్రి ముర్గేశ్ ఆర్ నిరాని, బసవరాజ్ బొమ్మై తదితర లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లను ప్రముఖంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

బసన్నగౌడ్ పాటిల్ యత్నాల్‌కు మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది. ఉత్తర కర్ణాటకలో ప్రాబల్యం ఉన్న వ్యక్తి. బీసీ రిజర్వేషన్ కోసం పంచమశాలి లింగాయత్‌లు చేసిన పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన్ని తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news