హుజురాబాద్ ఉప ఎన్నిక పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా జమ్ముకుంట తనగుల ఎంపీటీసీకీ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దళితబంధు పథకం గురించి ఫోన్ లో ప్రస్తావించారు సీఎం కేసీఆర్.
దళిత బంధు గురించి అన్ని గ్రామాలకు తెలపాలని సీఎం కేసీఆర్ కోరారు. అంతేకాదు..మొట్ట మొదటి సారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ చాలా చిన్నోడని….ఈటెల రాజేందర్ తో అయ్యేది కాదు- పోయేది కాదు అంటూ సీఎం కేసీఆర్ అన్నారు. ఈటెల రాజేందర్ ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్న సీఎం కేసీఆర్… దళిత బంధు మంచి పథకమని పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజక వర్గం మాత్రమే కాదు- రాష్ట్రం అంతా దళితులు బాగుపడుతారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని పకడ్భందీగా అమలు చేయాలని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.