‘హలో.. రేటెంత?’ అంటూ ఆ మహిళకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఫోన్ రింగ్ అయితే చాలు భయం పుడుతోంది. వరుసగా ఫోన్లు మోతెక్కుతుంటే ఆమెకు నోటి మాట రావడం లేదు. ఆమెకే కాదు ఆమె సోదరులకూ ఫోన్లు చేసి ‘అమ్మాయి.. ఉందా?’ అంటూ ప్రశ్నలు. ఏం జరుగుతుందో అర్థం గాక ఆందోళనకు గురై.. చివరికి పోలీస్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. అప్పుడు దర్యాప్తు చేసిన అధికారులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చే విషయ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త నుంచి విడాకుల కోసం ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కోపంతో కుట్ర పన్నిన భర్త.. ఫేస్‌బుక్‌లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు పోస్టు చేసి, ‘కాల్ గర్ల్స్ కావాలా?’ అంటూ ప్రకటన క్రియేట్ చేశాడు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ యాడ్ చూసిన అనేక మంది వారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ విషయం కనిపెట్టారు. ఆమె భర్తపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.