సోషల్‌ మీడియాలో కుమార్తె న్యూడ్ వీడియోలు పోస్టు చేసిన తండ్రి

-

నేటి సమాజంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వావి వరుస లేకుండా మృగాళ్లో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరేమో వారి ఫొటోలు మార్ఫ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరూ వారి నగ్న చిత్రాలను నెట్టింట పోస్టు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఘటనలో కన్నతండ్రే తన కుమార్తె న్యూడ్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలోని ఉడుపిలో ఆసిఫ్ అనే వ్యక్తి తన కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలనునెట్టింట పోస్టు చేసినట్లు అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తండ్రి చేసిన పనికి కుంగిపోయిన యువతి (19) ఫినాయిల్‌ తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

తీర్థహళ్లికి చెందిన బంధువుల యువకుడు తౌసిఫ్‌ను ఆ యువతి ప్రేమిస్తుండగా  తౌసిఫ్‌ను తన ఇంటికి పిలిచి, తన కుమార్తెతో తిరగవద్దని హెచ్చరించి ఆసిఫ్‌ దాడి చేశాడు. ఆ సమయంలో అతడి ఫోన్ లో ఉన్న కుమార్తె వీడియోలు, ఫొటోలను తన ఫోన్‌కు పంపించుకుని సోషల్ మీడియాలో తన స్నేహితుల వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న అతణ్ని నిలదీయడంతో ఆమెపైనా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version