తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు కాదు : సీఎం కేసీఆర్

-

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు అన్ని వనరులు, సౌకర్యాలు ఉన్న మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపుర్‌ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయని.. అభివృద్ధి విషయంలో భారత్​ ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్‌ పాలించిందని.. మహారాష్ట్రలో ప్రజలు కాంగ్రెస్‌, శివసేన, బీజేపీకి అవకాశం ఇచ్చారని.. ఇన్నేళ్లలో రాష్ట్రానికి వారేం చేశారో ఓ సారి మరాఠా ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.

“మా విషయంలో అన్ని పార్టీలూ ఆందోళన చెందుతున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాల మాత్రమే నిలుస్తుంది. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరముంది ’’ అని కేసీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news