ఏపీ గవర్నర్ త్వరగా కోలుకోవాలి – నారా లోకేష్

-

అనారోగ్యానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ నజీర్ త్వరగా కోలుకోవాలని టిడిపి నేత నారా లోకేష్ ఆకాంక్షించారు. ‘కడుపునొప్పితో గవర్నర్ ఆసుపత్రిలో చేరారని తెలిసి ఆందోళనకు గురయ్యా. డాక్టర్లు అపెండిసైటిస్ ఆపరేషన్ విజయవంతంగా చేశారని…. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. గవర్నర్ సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

కాగా, వినాయక చవితి పర్వదినాన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చికిత్స పొందుతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘కడుపునొప్పితో గవర్నర్ ఆస్పత్రిలో చేరారు. ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి…అపెండిసైంటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించాం. రోబోటిక్ అపెండెక్టమీ సర్జరీ చేసాం. ఆపరేషన్ సక్సెస్ అయింది. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news