CSK vs KKR: ధోని సేనపై కోల్‌కతా విజయం..

-

ఐపీఎల్ 2023 సీజన్ కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఈ తరుణంలోనే… చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పరాజయంతో చెన్నై… పాయింట్స్ టేబుల్ లో టాప్-2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

పేలవ బ్యాటింగ్ చెన్నై కొంపముంచగా.. రింకు సింగ్, నితీష్ రానా 99 పరుగుల అసాధారణ భాగస్వామ్యం కేకేఆర్ ను గెలిపించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. శివమ్ దూబే, రవీంద్ర జడేజా రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు తీయగా…శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసే 9 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్నందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news