IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

-

కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పరాజయంతో చెన్నై… పాయింట్స్ టేబుల్ లో టాప్-2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పేలవ బ్యాటింగ్ చెన్నై కొంపముంచగా.. రింకు సింగ్, నితీష్ రానా 99 పరుగుల అసాధారణ భాగస్వామ్యం కేకేఆర్ ను గెలిపించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది.

శివమ్ దూబే, రవీంద్ర జడేజా రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు తీయగా…శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసే 9 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఒక అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్… ధోనిని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్భుతం సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. ధోని అభిమానానికి ముచ్చట పడిన సునీల్ గావస్కర్ స్వయంగా అతని వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడు. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్ గావస్కర్ షర్ట్ ముందుభాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్ ఇవ్వడం… ఆ తర్వాత ధోనిని సునీల్ గావస్కర్ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news