శర్వానంద్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!

-

ప్రస్తుత కాలంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పెళ్లి అనేది ఎంత త్వరగా కుదురుతుందో అంతే త్వరగా బ్రేకప్ అవుతుంది అని చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాలుగా చాలామంది సెలబ్రిటీలు వరుస పెట్టి మరి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎప్పుడు వివాహం చేసుకుంటారు అన్న విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కూడా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

గత కొన్ని నెలల క్రితం రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకకు రామ్ చరణ్, అతిధిరావు హైదరి , అఖిల్ అక్కినేని, సిద్ధార్థ్ , చిరంజీవి ఇలా తదితరులు హాజరై నూతన కాబోయే జంటను ఆశీర్వదించారు. ఇకపోతే వీరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు 5 నెలలు గడిస్తున్నా ఇంకా పెళ్లిపై ఎటువంటి క్లారిటీ రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ క్రమంలోని రక్షిత రెడ్డి శర్వానంద్ ను పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

మరొకవైపు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలపై తాజాగా శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ముందే తాను కమిట్ అయిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచనతోనే శర్వానంద్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి ఆలస్యం అవుతుంది. దయచేసి ఇకపై ఇలాంటి రొమాన్స్ సృష్టించకండి అంటూ శర్వానంద్ టీం వెల్లడించింది. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news