ఢిల్లీ ప్రభుత్వం రద్దు..అధికారిక ప్రకటన !

-

ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత సీఎం పదవికి అతిశీ రాజీనామా సమర్పించారు. ముఖ్యమంత్రి రాజీనామాతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ LG కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

Lieutenant Governor VK Saxena issued an order dissolving the Delhi government

ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కాగా… తన పదవికి ఢిల్లీ సీఎం అతిశీ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన అతిశీ.. ఎల్జీ వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. ఆప్‌ 22 స్థానాల కే పరిమితమైంది. కాగా, ఆప్ నుంచి మహిళా అభ్యర్థి అతిశీ ఒక్కరే గెలుపొందిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version