చనిపోతూ నలుగురికి ప్రాణం పోసిన ఓ వైద్యురాలు. ఈ సంఘటన హైదరాబాద్ పరిధిలోనే చోటు చేసుకుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘటనలో యశ్వంత్ అనే డాక్టర్ మృతి చెందారు.. భూమిక అనే వైద్యురాలు గాయాల పాలు అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూమిక బ్రెయిన్ డెడ్ అయిందని.. నిర్ధారించారు వైద్యులు.
ఇక భూమిక పేరెంట్స్ అంగీకారంతో.. ఆమె గుండె, లివర్, కళ్లు, కిడ్నీస్ దానం చేయడం జరిగింది. ఆ అవయవాలు దానం చేయడంతో.. నాలుగు ప్రాణాలు ఊపిరి పోసుకున్నాయి. భూమికి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో.. ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా… చనిపోతూ నలుగురికి ప్రాణం పోసిన ఆ డాక్టర్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల క్రితం ఖానాపూర్ వద్ద డివైడర్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరూ మరణించారు.