లోక్‌సభ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం శుక్రవారం (ఏప్రిల్ 26న) జరగనుంది. సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు రెండోదశ పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ కేరళలోని 20 లోక్‌సభ స్థానాలు, కర్ణాటక- 14, రాజస్థాన్- 13, మహారాష్ట్ర- 8, ఉత్తర్ప్రదేశ్- 8, మధ్యప్రదేశ్- 6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లోని చెరో స్థానానికి పోలింగ్ జరగనుంది.
బిహార్‌లోని కిషన్‌గంజ్, ఉత్తర్ప్రదేశ్‌లోని మథుర, అలీగఢ్, మహారాష్ట్రలోని అకోలా, అమరావతి, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, కేరళలోని వయనాడ్, కోజికోడ్, తిరువనంతపురం, అసోంలోని సిల్చార్, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, మధ్యప్రదేశ్‌లోని దామోహ్, రేవా స్థానాలు ఉన్నాయి. మణిపుర్‌లోని ఔటర్ మణిపుర్, రాజస్థాన్‌లోని బార్మర్, కోట, జలోర్, అజ్మీర్, బంగాల్‌లోని డార్జిలింగ్, బలూర్‌ఘాట్, కశ్మీర్‌లోని జమ్ము రెండో విడత ఎన్నికలు జరగనున్న కీలకమైన లోక్‌సభ స్థానాలు.