ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు

-

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసింది. డబ్బులు తీసుకోని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని.. మహువా గత కొద్ది రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ను వేరే వాళ్లకి ఇచ్చినట్టు నిర్దారణ అయింది. అయితే ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ అంశంపై లోక్ సభలో చర్చ జరిగింది. చర్చ తరువాత మహువా లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసింది.

వివరాల్లోకి మహువా మొయిత్రా లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామిక వేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఇటీవలే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. దీంతో ఎథిక్స్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. మహువా మొయిత్రాతో పాట ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్ ను కూడా కమిటీ విచారించింది. చివరికీ ఈ కమిటీ 500 పేజీలతో కూడిన ఓ నివేదికను రూపొందించింది.

మహువా అనైతిక ప్రవర్తనా, సభ ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ పేర్కొంది. లోక్ సభ నుంచి బహిష్కరించాలని కూడా సిఫార్సు చేసింది. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్ననేపథ్యంలో ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోన్కర్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఓటింగ్ నిర్వహించేందుకు ముందు సభలో చర్చ జరగాలని వాదించాయి. చివరికీ మూజువాణి ఓటుతో ఎథిక్స్ కమిటీ ప్రవేశపెట్టిన నివేదికను లోక్ సభ ఆమోదించింది. మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news