ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

-

2018 పార్లమెంట్ ఎన్నికల్లో  మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించిన ఎనుముల రేవంత్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఇవాళ ఢిల్లీలో ఎంపి పదవీకి  సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్ల ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. నేరుగా పార్లమెంటుకు వెళ్లారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లను కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గెలిచిన 14 రోజుల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పార్లమెంట్  సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొన్న ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news