IPL 2023 : ప్లే ఆఫ్స్ కు చేరిన లక్నో..

-

IPL 2023 లో భాగంగా నిన్న రసవత్తరమైన పోరు జరిగింది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృధా అయ్యింది.

Lucknow Super Giants won by 1 run

యష్ థాకూర్ అసాధారణ బౌలింగ్ తో లక్నోకు విజయం అందించాడు. ఈ గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ నిర్నీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. రింకు సింగ్ కు తోడుగా జాసన్ రాయ్ రాణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news