దిల్లీ లిక్కర్ కేసు.. అప్రూవర్లుగా మాగుంట రాఘవ్‌, దినేష్‌ అరోరా

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన అధికారులు వారిని విచారిస్తున్నారు. మరోవైపు ఇంకొందరికి నోటీసులు అందజేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం అవుతున్న దశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లిక్కర్ స్కామ్​ కేసులో ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ కేసులో నగదు అక్రమ చలామణీ వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నిందితులుగా ఉన్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్, దిల్లీ వ్యాపారవేత్త దినేష్‌ అరోరా అప్రూవర్లుగా మారేందుకు దిల్లీ రౌస్‌ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ.. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. దిల్లీ మద్యం విధానం కేసులో రాఘవ్, దినేష్‌ శర్మను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న వారిద్దరికీ దిల్లీ హైకోర్టు గతంలోనే బెయిల్‌ ఇచ్చింది. ఇదే కేసులో మరో నిందితునిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version