పవన్ చేసే ప్రతి కామెంటుపై నేను స్పందించాల్సిన అవసరం లేదని.. పొత్తులపై పవన్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. పొత్తులు.. పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని.. ప్రస్తుతం పవనుతో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలని పేర్కొన్నారు. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుంది…మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ అని వివరించారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నామని.. ఆయుష్మాన్ భారత్ కార్డులు 10596 కార్డులను పేదలకు పంపిణీ చేశామన్నారు. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశామని.. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది.. జేపీ నడ్డా హాజరు కానున్నారని వివరించారు.మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధుల మళ్లింపుపై ఆందోళనలు చేపట్టామని…కేంద్ర బృందం వచ్చి.. నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టిందన్నార బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.