తక్కువ జాతి కావడంతో నన్ను అవమానించారు.: నవనీత్ కౌర్

-

మహారాష్ట్రలో రాజకీయాలు ‘ హనుమాన్ చాలీసా’ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసం ‘ మాతో శ్రీ’  ముందు హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటించి సంచలనానికి దారి తీశారు ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాల ఇంటి ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. 

ఇదిలా ఉంటే ఈ వివాదంపై నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ముంబై కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇదిలా ఉంటే సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ నవనీత్ కౌర్. తనను అవమానించిన తీరుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన హిందుత్వం నుంచి పూర్తిగా తప్పుకుందని… ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరపరిచి ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలతో జతకట్టిందని నవనీత్ కౌర్ ఆరోపించారు. నేను షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని కావడంతో తన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అవరోధాలు కల్పించారని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. నేను రాత్రిపూట బాత్రూమ్ ఉపయోగించాలనుకున్నప్పుడు, పోలీసు సిబ్బంది నా డిమాండ్లను పట్టించుకోలేదని.. నన్ను మళ్లీ అత్యంత నీచమైన భాషలో దుర్భాషలాడారు…నీచి జాత్ షెడ్యూల్డ్ కులాల వారిని మా బాత్‌రూమ్‌లు వాడనివ్వబోమని చెప్పారంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది నవనీత్ కౌర్.

Read more RELATED
Recommended to you

Latest news