టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ !

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈడీ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేసిన ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలు కూడా ఇచ్చామని.. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు ఈడీకి అప్పగించామని వివరించారు. దర్యాప్తు అధికారులు నిందితుల కాల్ డేటా రికార్డులు సేకరించలేదని.. కెల్విన్ కేసులో సమాచారం సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటా ఈడీకి ఇచ్చామన్నారు ఎక్సైజ్ డైరెక్టర్.

12 మంది విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగులు ఇచ్చామని.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదని వెల్లడించారు. పాలనపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైందని.. హైకోర్టు ఆదేశాలను అమలులో కొంత ఆలస్యమైనందున బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు ఎక్సైజ్ డైరెక్టర్.

పాలనపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైందని.. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధం, కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయండన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ లో వాదనలకు సమయం కోరిన ఈడీ.. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరారు. విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news