మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీశ్రీ కుమార్తె….

-

తెలుగు సాహిత్యపు దశనూ దిశనూ మార్చిన శ్రీరంగం శ్రీనివాసరావు కుమార్తె అయిన మాలకు ఉన్నత పదవి. శ్రీ శ్రీ సరోజ దంపతులకు నాలుగో సంతానం అయిన మాల మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాసు హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరిలో మాల ఎస్ సౌందర్ ల పేర్లను రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అయితే వీరికి మార్చి 24న ఉత్తర్వులు జారీ చేశారు.

32 ఏళ్లుగా మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాల భర్త నిడుమోలు రాధా- రమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నతాధికారిగా ఉన్నారు. కాగా శ్రీ శ్రీ కుమార్తె మాల మద్రాసు లా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. మాల భర్త రాధా రమణ ది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా. మాల రాధా- రమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్, జయప్రకాష్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news