పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతల తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు అనే పదాన్ని ఉచ్ఛరించకుండా(వారిని ఉద్దేశిస్తూ).. ‘కొంత మంది పశ్చిమబెంగాల్‌లోనే ఉంటున్నారు. ఇక్కడే తింటున్నారు. పైగా బెంగాల్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. బెంగాల్‌కు దిల్లీ (కేంద్ర సర్కారు) డబ్బులివ్వదని మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.
అయినా తనకు దిల్లీ నుంచి వచ్చే డబ్బులు అవసరం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌కు తన కాళ్లపై తాను నిలబడే సామర్థ్యం ఉందని అన్నారు. తమకు ఆత్మగౌరవమే ముఖ్యమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దిల్లీ కాళ్ల దగ్గర పెట్టబోమని తేల్చి చెప్పారు.