జీవనశైలిలో మార్పుల వల్ల చాలా మంది చిన్న వయసులోనే కూర్చున్న చోటే కుప్పకూలుతున్నారు. డ్యాన్స్ చేస్తూ.. భోజనం చేస్తూ.. వ్యాయామం చేస్తూ.. కూర్చొని తమ పని తాము చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే వాళ్లు చనిపోయారని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జిమ్ లో కసరత్తు చేస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆ తర్వాత ఏమైందంటే..?
జబల్పూర్ నగరం గోరఖ్‌పూర్ ప్రాంతంలోని జిమ్‌లో యతీష్ సింఘై అనే 52 ఏళ్ల వ్యక్తి వ్యాయామం చేస్తూ కుప్పకూలాడు. గమనించిన తోటివారు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే యతీష్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డయింది. కసరత్తు చేసేందుకు డంబెల్ తీసుకెళ్లి.. వ్యాయామం చేద్దామనుకునేలోగానే యతీష్ ఉన్నచోటే కుప్పకూలడం ఆ వీడియోలో చూడొచ్చు. యతీష్ సింఘై గోల్డ్స్ జిమ్‌కు రెగ్యులర్‌గా వస్తుంటాడని అక్కడ పనిచేసే సిబ్బంది తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజు కూడా ఉదయం 6.45 గంటలకు జిమ్ కు చేరుకున్నాడని వెల్లడించారు. అయితే గుండెపోటు రావడం వల్లే యతీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పినట్లు వివరించారు.
జిమ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి మృతి
మధ్యప్రదేశ్ – జబల్పూర్ నగరం గోరఖ్‌పూర్‌లో జిమ్ చేస్తూ కుప్పకూలిన యతీష్ సింఘై(52) అనే వ్యక్తి
ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్దారించిన డాక్టర్లు pic.twitter.com/xevZ74Slkn
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025