మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్సీకి ఘోర అవమానం ఎదురైంది. ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. అసలేం జరిగిందంటే..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజ్ఞా సాతవ్పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు . బుధవారం రాత్రి ప్రజలతో ప్రజ్ఞ మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. ఆమెను లాగి అనంతరం చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ. అతడిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.
హింగోలి జిల్లా పర్యటనలో ఉండగా ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్పై ఈ దాడి జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సాతవ్ భార్య.