కార్మికుల దుర్మరణం విచారకరం – పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా జారిపడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. రాగం పేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేయడానికి కార్మికులు పనిచేస్తున్నారు.

ట్యాంకర్ చాలా పెద్దది కావడంతో ఓ కార్మికుడు ట్యాంకర్ ను నిచ్చెన సహాయంతో శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఒక్కసారిగా ట్యాంకర్ లో పడిపోయాడు. దీన్ని గమనించిన మిగతా కార్మికులు అతడిని కాపాడే క్రమంలో అందులోకి దిగారు. ట్యాంక్ భారీ మొత్తంలో ఉండడంతో కార్మికులకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆ ట్యాంకర్ లో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news