దేశంలో నిత్యం ఏదో మూలన దళితులు అవమానాలు, వివక్షలు, చీత్కరింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు.ఇటీవలే అంబేద్కర్ జయంతిని రైట్ నుంచి లెఫ్ట్ వరకూ అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా కుల వివక్షత పై రాజకీయ నాయకులు గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చారు.అయినా…దళితులపై దారుణాలు ఆగడం లేదు.తాజాగా ఉత్తరప్రదేశ్ లోని దళిత యువకుడిపై అమానవీయ ఘటనజరిగింది..మహొబా జిల్లాలో ఓ దళితుడు గ్రామ శివారుకు మల మూత్ర విసర్జనకు వెళ్ళాడు.అక్కడే మద్యం సేవిస్తున్న కొందరు వ్యక్తులు అటుగా వెళ్తున్న ఆ యువకుడిని పిలిచి అత్యంత ఘోరంగా ప్రవర్తించారు.
ఆ యువకుడి శరీర భాగాల్లోకి మద్యం సీసాను చొప్పించి పైశాచిక ఆనందం పొందారు.విషయం బయటకు చెబితే చంపేస్తామని అనడంతో భయపడిపోయాడు.దీంతో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్ళాడు.అనంతరం నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో వాళ్లకు జరిగిన దారుణం గురించి వివరించాడు.షాక్ అయిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు…వెంటనే స్పందించిన అధికారులు స్థానిక హెల్త్ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.