ప్ర‌జ‌లు చ‌నిపోతుంటే కోవిడ్ టీకాల‌ను ఇత‌ర దేశాల‌కు ఇస్తారా : మ‌నీష్ సిసోడియా

-

దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల‌కు కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో 18-44 ఏళ్ల వ‌య‌స్సు వారికి చాలా రాష్ట్రాల్లో టీకాల‌ను ఇవ్వ‌డం లేదు. మొద‌టి డోసు తీసుకుని చాలా రోజులు అవుతున్న వారికే రెండో డోసు ఇస్తున్నారు. అయితే దేశంలో ఉన్న కోవిడ్ టీకాల కొర‌త‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

manish sisodia slams for center for exporting covid vaccines

ఓ వైపు దేశంలో ప్ర‌జ‌లు క‌రోనాతో చ‌నిపోతుంటే కేంద్రం మాత్రం వ్యాక్సిన్ల‌ను ఇత‌ర దేశాల‌కు ఎగుమతి చేస్తుంద‌ని సిసోడియా అన్నారు. ఇత‌ర దేశాల‌కు కోవిడ్ టీకాల‌ను ఎగుమతి చేయ‌కుండా మ‌న దేశంలోనే వాడి ఉంటే ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాల‌ను ర‌క్షించి ఉండేవార‌మ‌ని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం 93 దేశాల‌కు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేసింద‌ని, అయితే వాటిని ఇత‌ర దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌కుండా మ‌న దేశంలోనే వాడి ఉంటే ప్ర‌స్తుతం కోవిడ్ ప‌రిస్థితి 60 శాతం వ‌ర‌కు కంట్రోల్‌లో ఉండేద‌న్నారు. కేంద్రం చేసిన ప‌ని వ‌ల్లే నేడు దేశంలో అనేక మంది యువ‌త కోవిడ్ బారిన ప‌డి చ‌నిపోతున్నార‌ని, ఇందుకు కేంద్ర‌మే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్రాల‌కు టీకాల‌ను స‌రిపోయినంత‌గా స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news