నేను చాలా అదృష్టవంతుడిని : మాక్స్‌వెల్

-

World Cup 2023 :  డబుల్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించినందుకు గర్వంగా ఉందని ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ తెలిపారు. ‘ఈరోజు నేను చాలా అదృష్టవంతుడిని. 33 పరుగుల వద్ద నా క్యాచ్ ను వదిలేసారు. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఈ ఇన్నింగ్స్ ఆడుంటే బాగుండేది. 201* పరుగులు చేసినందుకు గర్వపడుతున్న’ అని మాక్సీ తెలిపారు. ఇక మ్యాక్స్వెల్ ఊచకోత ఇన్నింగ్స్ ను ఎలా వర్ణించాలో మాటలు రావట్లేదని కెప్టెన్ కమిన్స్ పేర్కొన్నారు.

maxwell comments on his batting

కాగా,  నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా జట్టు. నిన్న మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఈ తరుణంలో 46 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version