2004లో నా జీతం నాలుగున్నర లక్షలు : కేటీఆర్

-

2004లో నా జీతం నాలుగున్నర లక్షలు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి సరిగ్గా చదువుకోలేదని….తాను ఉన్నతంగా చదివానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం తెచ్చుకున్న. 2004లో నేను ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు నా నెల జీతం నాలుగున్నర లక్షలు. ఇప్పటికీ అదే ఉద్యోగం చేస్తుంటే నెలకు కోటో, రెండు కోట్లో సంపాదించేవాడిని. మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఇది తెలుసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Minister KTR’s visit to Sirisilla district today

ఇక అటు రాహుల్‌ గాంధీ వచ్చి బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్ అంటారని.. ప్రధాని మోదీ వచ్చి….కాంగ్రెస్‌కు సీ-టీమ్ అంటారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్‌కాదని, కాంగ్రెస్‌కు సీ-టీమ్‌ కాదని ముమ్మాటికి టీ (తెలంగాణ) టీమ్‌ అని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిన్నటి వరకు మత రాజకీయం చేశారు, నేడు కులరాజకీయానికి తెర తీశారని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version