ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాలాలపై బ్యాన్‌ విధించిన నేపాల్‌

-

భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్, ఎండీహెచ్‌కు మరో షాక్‌ తగిలింది. ఇటీవలే సింగపూర్‌, హాంకాంగ్‌లో వేటుకు గురైన ఈ కంపెనీలపై తాజాగా నేపాల్‌ కూడా బ్యాన్‌ విధించింది. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు నేపాల్‌ ప్రకటించింది. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు ఫుడ్‌ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్‌ కృష్ణ మహారాజన్‌ తాజాగా ప్రకటించారు. ఈ మాసాలాల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలాల్లో ఇథలిన్‌ ఆక్సైడ్‌ మోతాదుకు మించి ఉన్నట్టు ఇటీవలే తేలిన విషయం తెలిసిందే. ఎవరెస్ట్‌ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించిన సింగపూర్‌ ప్రభుత్వం.. తిరిగి వాటిని భారత్‌ పంపేయాలని ఆదేశించింది. ఎండీహెచ్ సాంబార్ మసాలాలో సైతం కేన్సర్‌ కారకాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో పలు దేశాలు ఈ రెండు ప్రాడక్ట్స్‌పై నిషేధం విధించాయి. ఇథిలిన్ ఆక్సైడ్ అధికంగా ఉన్నందున సింగపూర్ ఎవరెస్ట్ మసాలాను మార్కెట్ నుంచి రీకాల్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news