తాను అద్దాల మేడల్లో ఉండటం లేదని.. అయినా నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇల్లు నిర్మించానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ అశోక్ విహార్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసంలో అత్యున్నత ప్రమాణాలతో రేనియేషన్ చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయిందని, రాజధాని లోని నిర్మాణ రంగంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.ఆప్ లిక్కర్ స్కామ్, స్కూల్ స్కామ్, పొల్యూషన్ స్కామ్ లకు పాల్పడిందన్నారు.
ఆప్ పై ఢిల్లీ ప్రజలు ఇప్పటికే యుద్ధం ప్రకటించారు. ఆప్ దా కో నహీ సహేంగే , బదల్ కర్ రహేంగే అని ఢిల్లీ ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. 2025 దేశ రాజధాని లోని సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోంది. కొత్త రాజకీయాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. మోడీ సొంతిల్లు కట్టుకోలేదని దేశ ప్రజలందరికీ తెలుసు. అయినా పేదల కోసం నాలుగు కోట్ల ఇల్లు నిర్మించాను. “నేను తలుచుకుంటే అద్దాల మేడ నిర్మించవచ్చు. కానీ మురికివాడల్లో నివసించే వారికి సైతం పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇదే విషయాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్లి స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న వారికి చెప్పాలి” అని మోడీ పేర్కొన్నారు.