ఫ్యాషన్‌ షోలో ప్రమాదం.. ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా మీదపడిన పిల్లర్‌..మోడల్ మృతి

-

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ప్రమాదం చోటుచేసుకుంది. మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఓ మోడల్​పై ఐరన్ పోల్ పడగా అక్కడికక్కడే మృతి చెందింది. నోయిడా ఫిల్మ్‌ సిటీలోని లక్ష్మీ స్టూడియోల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫ్యాషన్‌ షో కోసం ర్యాంప్‌వాక్‌ పక్కన అమర్చిన లైట్ల స్తంభం ఒక్కసారిగా ర్యాంప్‌పై పడిపోయిందని పోలీసులు తెలిపారు. అదే సమయంలో 24 ఏళ్ల వన్షికా చోప్రా అక్కడ నడుస్తుండగా ఆ స్తంభం ఆమె మీద పడిందని చెప్పారు. దీంతో తీవ్రంగా గాయపడిన వన్షికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీ రాజ్‌ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫ్యాషన్‌ షోకు అనుమతి లేకపోయినా నిర్వాహకులు ఈవెంట్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news