ఏపీ ప్రజల కోసం యాగం మొదలు పెట్టారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కాగా, ఈ నెల 14 వ తేదీ నుంచి ఏపీ లో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… ఈ యాగాలు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉండగా, వారాహి యాత్ర ఏర్పాట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలపై జనసేన పార్టీ నేతలతో చర్చించనున్నారు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి యాత్రకు ఓ రోజు ముందుగానే అంటే రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.