డిసెంబర్ 21న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. తన పుట్టిన రోజున విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అమలు చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..నాలుగేళ్లలోనే విద్యారంగంలో చాలా మార్పులు తెచ్చాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యాకానుక అన్నారు. ప్రతి విద్యార్థికి యునిఫాంతో పాటు నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ.. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు ఉచిత కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. బడి పిల్లలు ఓటర్లు కాదు, అయినా విద్యాకానుక ఇస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థుల్ని తయారుచేశాం.. ఇంగ్లీష్‌లో మాట్లాడేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం.. జగనన్న విదేశీ దీవెనకు 20 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు సీఎం జగన్.