జీ-20 వేళ మోదీ షెడ్యూల్ బిజీబిజీ.. ప్రపంచ నేతలతో 15కు పైగా ద్వైపాక్షిక భేటీలు

-

జీ-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ సదస్సు కోసం దిల్లీలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అగ్రదేశాధినేతలు ఒక్కొక్కరుగా దిల్లీకి వస్తున్నారు. అయితే ఈ శిఖరాగ్ర సదస్సు వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉండనున్నట్లు తెలిసింది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. దాదాపు 15 భేటీల్లో మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈరోజు మోదీ తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్​, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. శనివారం జీ-20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు జపాన్‌, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆదివారం రోజున ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో.. ఆ తర్వాత కెనడా ప్రధానితో ముచ్చటించనున్నారు. తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్‌, ఈయూ/ఈసీ (యూరోపియన్‌ కమిషన్‌), బ్రెజిల్‌, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news