రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రారంభానికి కేరళలలో అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఇటీవలే మీడియాకు వెల్లడించారు.
చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం.. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించారు. ఇవాళ రాష్ట్రంలో ఉస్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు రుతుపవనాల ప్రభావం ఉంటుందని తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకు విస్తరించనున్నాయి.